జర్నలిస్టులకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ..


Ens Balu
2
Visakhapatnam
2021-09-08 07:47:23

వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా తమ సభ్యులందరికీ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు ఫోరమ్ అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు బుదవారం తెలిపారు. ఈ మేరకు వీరు మాట్లాడుతూ గురువారం  ఉదయం 10 గంటల నుంచి సీతమ్మ దార విజేఎఫ్ వినోద వేదిక,నార్లవెంకటేశ్వరరావు భవన ప్రాంగణంలో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. జర్నలిస్ట్ లుకు వినాయక విగ్రహాలతో పాటు వ్రతకల్ప పుస్తకం, వివిధ రకాల పూలమొక్కలు అందజేస్తామన్నారు.
పర్యావరణానికి పెద్ద పీట వేస్తూనే నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.. క్లబ్ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని వినాయక విగ్రహాలు తదితర సామాగ్రి స్వీకరించవలసిందిగా కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే జర్నలిస్టులు కూడా అన్ని పండుగలు నిర్వహించుకోవాలని, అందరు కలిసి మెలిసి సుఖసంతోషాలతో ఉండాలన్నదే వైజాగ్ జర్నలిస్టుల ఫోరం పాలకవర్గం లక్ష్యమన్నారు.  సీనియర్ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ దియేటర్ సౌజన్యం తో ఉదయం నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వీరు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యలు పాల్గొన్నారు.