మట్టి వినాయక విగ్రహాలనే వినియోగిద్దాం..
Ens Balu
2
Srikakulam
2021-09-08 09:23:19
మట్టి వినాయక విగ్రహాలతోనే వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని సమాచార శాఖ సహాయ సంచాలకులు ఎల్ రమేష్ జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు.బుధవారం ఉదయం ఆయన కార్యాలయంలో జై భారత్ ముద్రించిన పండగ పూట పాపం చేయడం ఎందుకు? గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సహాయ సంచాలకులు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, హానికర విష రసాయనాల రంగులు వినియోగించిన విగ్రహాలను వాడి పర్యావరణాన్ని పాడుచేయవద్దని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మట్టి విగ్రహాలనే వినియోగించాలని పిలుపునిచ్చిన సంగతి విదితమేనని అన్నారు. దైవం మెచ్చే రీతిలో, పుడమితల్లికి నచ్చే రీతిలో భక్తి పారవశ్యంతో గణేశుని అర్చిద్దామని ఆయన కోరారు. మట్టి వినాయక ప్రజలతోనే పూజిద్దామని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన కోరారు. మట్టి వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసే సమయంలో చెరువులు, నదులు కాలుష్యం నుండి రక్షింపబడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జై భారత్ సభ్యులు జి.వి నాగభూషణరావు ,కళ్యాణ చక్రవర్తి,రామారావు,రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.