దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు నిర్మించాలి..
Ens Balu
1
Visakhapatnam
2021-09-08 10:50:35
దివ్యాంగులు తమ అవసరాలు, పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు, ఆస్పత్రులకు వెళ్లేందుకు వీలుగా సంబంధిత ప్రాంతాలలో రాంప్, టాయ్లెట్ లు, వాహనాల పార్కింగ్ తదితర పనులను చేపట్టే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న "సుగమ్య భారత్ అభియాన్ ఆక్సెస్ ఇండియా కాంపైన్ ప్రోగ్రామ్" ను జిల్లాలో వేగవంతం చేయాలని జిల్లా కలక్టర్ డా ఏ మల్లిఖార్జున సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "స్కీం ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజభిలిటీస్ ఆక్ట్-2016"(SIPDA)కార్యక్రమానికి సంబంధించి జీ వీ ఎం సి, ఏ పీ ఈ డబ్ల్యూ ఐ డి సి, ఏ పీ ఎస్ ఆర్ టీ సి, ఆర్ & బి, ఏ పీ ఎం ఎస్ ఐ డీ సి మొదలైన ఐదు శాఖలు 38 రకాల పనులను నిర్వర్తిస్తున్నాయని,వాటికి సంబంధించి రూ 1436.33 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రత్నరాజు మాట్లాడుతూ తమ పరిధిలో 7 పనులు మంజూరు కాగా వాటిలో 6 పనులు పూర్తి చేయడం జరిగిందని,మిగిలిన ఒకటి 80% అయ్యిందని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఏపీఈ డబ్ల్యు ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం జగ్గారావు మాట్లాడుతూ తమకు కేటాయించిన పది పనులలో ఒకటి మాత్రమే పూర్తయిందని ,మిగిలిన కొన్నిి టెండర్ ప్రక్రియ లోనూ వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసి డెప్యూటీ ఇంజనీర్ పీవీ నరసింహారావు మాట్లాడుతూ తమకు కేటాయించిన ఆరు పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఆర్ & బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాన్ సుధాకర్ మాట్లాడుతూ తమకు కేటాయించిన పది పనులు టెండర్ ప్రక్రియలోను ,వివిధ దశలలోను ఉన్నాయన్నారు. ఏ పీ ఎం ఎస్ ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిఎ నాయుడు మాట్లాడితూ అయిదు పనులకు సంబంధించి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ మొత్తం 38 పనులకు గాను 7 పనులను మాత్రమే పూర్తిచేయడం చాలా అలసత్వం గా ఉందన్నారు. వెంటనే టెండర్ ప్రక్రియను పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని, నాణ్యమైన మెటీరియల్ నుఉపయోగించి పనులను వేగవంతం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో పనుల పురోగతి పై మరలా సమీక్షిస్తానని అప్పటికి ప్రోగ్రెస్ కనబడాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు, డిజేబుల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ జి వి ఆర్ శర్మ పాల్గొన్నారు.