వ్యాధులు ప్రభలకుండా అప్రమత్తంగా ఉండాలి..
Ens Balu
2
Vizianagaram
2021-09-08 11:19:41
వర్షాలు పడుతున్న దృష్ట్యా గ్రామాల్లో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు అప్రమత్తంగా వుండాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు ఆదేశించారు. జ్వరాలకు సంబంధించి సమాచారం అందితే వెంటనే ఆయా గ్రామాల్లో ఆరోగ్య తనిఖీలు చేపట్టి వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. చీపురుపల్లి మండలంలో జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు బుధవారం అలజంగి, రామలింగాపురం గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, జ్వరాల పరిస్థితి, వ్యాధుల పరిస్థితిపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నారు. అలజంగిలో వివిధ సంక్షేమ పథకాల నోటిఫికేషన్లు, ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకునే విధానం, వాటిని పొందేందుకు కావలసిన అర్హతలు సంబంధిత సమాచారం సచివాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించిందీ లేనిదీ జె.సి. తనిఖీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారం ఏవిధంగా చేస్తున్నదీ ఆరా తీశారు. రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు మంజురు వంటివి నిర్ణీత గడువులోగా మంజూరు చేస్తున్నదీ లేనిదీ తెలుసుకున్నారు.