కోరమండల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అరుణ్ అలగప్పన్ తన కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ లతో కలిసి బుధవారం సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఈఓ సూర్యకళ, ఏఈఓ ఆనంద్ కుమార్, అధికారులు స్వాగతం పలి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు స్వామివారి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విజిటర్స్ బుక్ లో స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రాశారు. అంతేకాకుండా దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకు రూ.10,00,000 (పది లక్షల రూపాయలు) ఇస్తానని ఈఓకు అలగప్పన్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అరుణ్ అలగప్పన్ కు ఈఓ వివరించారు. దేవస్థానం పరిసరాలను, పరిశుభ్రతను చూసి ఎంతోఆనందం వ్యక్తం చేశారు. స్థల పురాణానాన్ని వివరించడంతోపాటు ఆలయం, కళ్యాణ మండపాన్ని కోరమండల్ టీంకు దగ్గరుండి చూపించారు. అనంతరం ఆలయంలో ఇటీవలే జరిగిన అభివృద్ధిని చూసి తెలుసుకొని మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని ఈఓను కోరారు. వారం రోజుల్లో ప్రకటించిన చెక్ ఇస్తానని చెప్పారు. అంతేకాదు భవిష్యత్ లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతామని కూడా ఆయన చెప్పారు. అరుణ్ అలగప్పన్ తోపాటు కోరమండల్ కంపెనీ ఎండీ సమీర్ గోయల్, దినేష్ (జీఎం- ఆపరేషన్స్ ), శంకర్ సుబ్రమమ్యం, బిజినెస్ హెడ్, రంగ కుమార్ (సీనియర్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్), జయశ్రీ శటగోపన్, సీఎఫ్ ఓ, కాలిదాస్ (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మార్కటింగ్ , రంగకుమార్ సీనియర్ జనరల్ మేనేజర్, సింహాద్రినాథుణ్ణి దర్శించుకున్నారు. అంతకు ముందు అర్చక స్వాములు ఆశీర్వాదం అందించగా, ఆలయ సిబ్బంది స్వామివారి ప్రసాదాని కంపెనీ సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.