ప్రజలకు అందించే సేవలు సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా లను తప్పనిసరిగా సచివాలయాల్లో డిస్ప్లే చేయాలని జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ అన్నారు. జిల్లా కలెక్టర్ గురువారం కె.వి పల్లి మండలం లోని గ్యారంపల్లి గ్రామ సచివాలయంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయము ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపికలు మార్గదర్శకాలు గురించి కలెక్టర్ సిబ్బందిని ప్రశ్నించారు. గ్రామంలో 2596 మంది జనాభా ఉన్నారు అని ఇందులో 45 సంవత్సరాలు నిండిన వారు 652 మంది ఉండగా మొదటి డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అందరికీ పూర్తి అయిందని 18 సంవత్సరాల పైబడిన వారు నాలుగు వందల ముప్పై మందిని గుర్తించాలని కలెక్టర్ కు తెలిపారు. గ్రామములు మొత్తం పదకొండు వందల ఇరవై నాలుగు ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని 530 ఎకరాలలో వేరుశెనగ , 535 ఎకరాలలో వరి పంట, టమోటా మామిడి పంటలు వేయడం జరిగిందని ఇందుకు సంబంధించి ఈ క్రాఫ్ బుకింగ్ కార్యక్రమం పూర్తి అయిందని ఈ కేవైసీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. భూ ఆక్రమణలు గురించి శ్రద్ధగా చూడాలని, రికార్డులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ఉండాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అధిక దిగుబడి పొందేందుకు వేరుశెనగలో పొలంబడి కార్యక్రమంను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించి సూచనలు ఇచ్చారు. గ్యారం పల్లి నుంచి శెట్టి వారి పల్లి వరకు రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తున్న అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమం ను పరిశీలించారు. ఉద్యానవన పంటల కింద వెంకటరమణా రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న మామిడి పంటలను పరిశీలించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందిస్తోంది అనే వివరాలు గురించి ప్రశ్నించారు . ఈ సందర్భంగా ఆయన మూడు ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ సహాయం అందుతుందని తెలిపారు. అనంతరం అదే గ్రామంలో జయప్రకాశ్ అని రైతు సాగుచేస్తున్న టమోటా పరిశీలించారు. మల్చింగ్ వేయడం ద్వారా కలుపు నివారించడం వలన రైతులు అదనపు ఆదాయం వస్తుందని కూలీల ఖర్చును లేకుండా చేసుకోగలగు తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా టమోటా మార్కెట్ ను ఏ విధంగా చేసుకుంటున్నారని మంచి ధరలు లభించాలంటే ఈ పద్దతిని పాటిస్తే బాగుంటుంది అని కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మనోహర్ తాసిల్దారు నాగ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.