ఒంటిమిట్టలో ముగిసిన పవిత్రోత్సవాలు..


Ens Balu
3
Ontimitta
2021-09-09 10:28:14

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారం ముగిశాయి. ఇందులో భాగంగా  సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. ఉద‌యం బాల‌బోగం, చ‌తుష్టానార్చ‌న‌,  మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, ఉద్వాసనలు, కుంబప్రోక్షణ, మహానివేదన  చేప‌ట్టారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపడతారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో ముర‌ళీధ‌ర్‌, సూపరింటెండెంట్ వెంక‌టేష్‌, కంక‌ణ‌భ‌ట్టార్  రాజేష్ స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.