సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు..


Ens Balu
2
అన్నవరం
2021-09-09 14:37:48

అన్నవరం శ్రీశ్రీశ్రీ సత్యదేవుని దేవస్థానంలో స్వామివారి హుండీల ద్వారా ఒక కోటి 95 లక్షల 39వేల 657 రూపాయాలు ఆదాయం వచ్చిందని ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. గురువారం దేవస్థానంలో స్వామివారి పరకామణి లెక్కింపు జరింగింది. అందులో భక్తుల నుంచి నగదుతో పాటు 90 గ్రాముల బంగారం, 15 వెండి వచ్చిందని మీడియాకి తెలియజేశారు. కోవిడ్  నిబంధనలు అనుసరిస్తూ హుండీల ఆదాయం లెక్కింపు చేసినట్టు ఈఓ తెలియజేశారు. కార్యక్రమంలో దేవస్థాన పీఆర్వో కొండలరావు,  అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.