పాయకరావుపేటలో అసలేం జరుగుతోంది..?
Ens Balu
3
Payakaraopeta
2020-09-09 21:14:17
పాయకరావుపేట నియోజకవర్గంలో అసలేం జరుగుతుంది..నియోజకవర్గ ఎమ్మెల్యేని కాదని ఏకపక్షంగా పనులు చేస్తున్న ఆ నాయకుడిని ఎవరూ ఎందుకు వారించ లేకపోతున్నారు.. యాక్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ కేడర్ ని కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారా..అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి. నియోజక వర్గంలోని నాకు స్వేచ్ఛకావాలి...ప్రజలకు సేవచేసే భాగ్యం నాకు కల్పించండి.. అంటూ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు కేడర్ ముందు, ప్రజల ముందు గొంతు విప్పుకొని అంతగా ఆందోళన పడేలా నియోజకర్గంలోనే ఏం జరుగుతున్నాయని ?... ఎస్.రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో పెట్టిన సమావేశాల్లో నేరుగా ఎమ్మెల్యే తన బాధను, ఆవేదనను మూడునెలల క్రితం వ్యక్తం చేయడం, దానికి అనుగుణంగానే నియోజకవర్గంలో ఒక నేత వ్యవహరించడం పార్టీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తాను చెప్పినట్టుగా వినకపోతే నియోజవర్గ కేడర్ ను రెండు వర్గాలుగా చేస్తానని గతంలో ప్రకటించిన విధంగానే ఆ నాయకుడు, నేరుగా ఎమ్మెల్యే ముందే కొట్టాటకి దిగడమే కాకుండా విషయానికి బలం చేకూరుస్తుంది. అంతేకాదు..ఎమ్మెల్యేని కాదని అవతలి వర్గం వారితో గొడవ పడి కూడా మొత్తం నాయకులందరికీ తెలిసేలా చేయడంలో ఎవరి అండ చూసుకొని ఇదంతా చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో ఇక్కడ జరుగుతున్న తంతు మొత్తం నిఘా వర్గాలు ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి తెలియజేస్తున్నప్పటికీ ఆ నేత తీరులో మార్పురాలేదు సరికదా..మరింత మొండిగా వ్యవహరిస్తూ..తనని కాదని కార్యక్రమాలు నిర్వహిస్తే...అనే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. పైగా తాను ప్రతిపాదించిన వారికే పనులు ఇవ్వాలని, తాను చేసే ఏ కార్యక్రమాల్లో ఎవరూ ఎదురు చెప్పకూడదనే హుకుం జారీ చేసినట్టుగా కేడర్ చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పేరుకి ఎమ్మెల్యే వున్నా హవా మొత్తం ఆ నేతే జరిపిస్తారని కేడర్ ను నమ్మించేంతగా నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే ఏ చిన్న తప్పు కనిపించినా ప్రతిపక్షాలు వాటిని చిలవలు పలవులుగా చేసి చూపిస్తున్న తరుణంలో ఇలాంటి యాక్టింగ్ ఎమ్మెల్యేల ఆగడాలకు, వ్యవహారాలకు చెక్ పెట్టకపోతే పాయకరావు పేట నియోజకవర్గంలో కేడర్ మొత్తం గ్రూపులుగా మారిపోయే అవకాశం వుంది. ఇప్పటికే అలా గ్రూపులుగా మారడంతోనే సోమవారం రాత్రి ఎమ్మెల్యే ముందే గొడవులు జరిగాయని పార్టీలోని నేతలే చెబుతున్నారు. ఈవిషయంలో ఎలాంటి ఆధారాలను బయటకు పొక్కనీయకుండా మా మాత్రం ఆ నేత ఇటు మీడియాని, అటు పార్టీలో తను భజన చేసే కొందరు నేతలతో కలిపి మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారని చెబుతున్నారు. చేసిన తప్పులు, అవినీతి వ్యవహరాలు రాసే జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం, వారిని బెదిరించడం వంటి కార్యక్రమాలు చేయడంలోనూ ఏ మాత్రం జంకకుండా వ్యవహారాలు చేయగలుగుతున్నారంటే ఏ టార్గెట్ తో, ఎవరి అండ చూసుకొని ఇవన్నీ చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ముందు ముందు పాయకరావుపేట నియోజకవర్గంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి అన్నట్టగా మారిపోయింది ఇక్కడ ఆ యాక్టింగ్ ఎమ్మెల్యే వ్యవహారం..అటు పార్టీగానీ, ఇటు ప్రభుత్వం గానీ ఈయన వ్యవహారాలు, విషయాలు, అజమాయిషి, యాక్టింగ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి...