శ్రీ శ్రీ శ్రీ సిద్ధిబుద్ధి సహిత వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ శుక్రవారం దర్శించుకున్నారు. గణపతి నవరాత్రి లో భాగంగా స్థానిక పురుషోత్తంనగర్ లో గల పంచాయతన దేవాలయంలో ఏర్పాటుచేసిన గణపతిని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త పి జగన్మోహన్ రావు కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ వనమోలి వెంకటరమణ శర్మ, రంపా వెంకటరమణ, రామ కృష్ణ, లక్ష్మీనారాయణ శర్మ కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తొలుత ఆలయ విశిష్టతను ధర్మకర్త కలెక్టర్ కు వివరించారు. వినాయక చవితి పర్వదినాన గణపతిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో విరజిల్లాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పి.జగన్మోహన్ రావు,సి.వి.ఎన్. మూర్తి, పి.వి.ఆర్.ఎం.పట్నాయక్, పి.వైకుంఠరావు,పి.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.