రణమా.. రాజీనా మీరే నిర్ణయించు కోండి!


Ens Balu
2
Srikakulam
2021-09-11 10:16:29

శ్రీకాకుళం జిల్లాలో చాలాకాలం నుండి పెండింగు లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు చక్క ని వేదిక లోక్ అదాలత్ అని, కావున కక్షిదారులు లోక్ అదా లత్ ను సద్వినియోగం చేసుకో వాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రామకృష్ణ పిలుపునిచ్చారు. సమయం లేదు మిత్రమా! రణమా ... శరణమా.. అని ఓ కవి చెప్పారని, అదేవిధంగా ఇక్కడ కూడ సమయం లేదు మిత్రమా.. రణమా లేదా రాజీ నా అని కక్షిదారులు నిర్ణయిం చుకోవలసిన సమయం ఆసన్న మైందని ప్రధాన న్యాయమూర్తి పోల్చిచెప్పారు. తమ కేసుల విషయమై గొడవలు పడి,ధనాన్ని, సమయాన్ని వృదాచేసుకునే బదులుగా కక్షిదారులు రాజీతో తక్షణమే కేసులను పరిష్కరించు కోవచ్చని చెప్పారు. తమ కేసుల కొరకు ఇతర కోర్టులను ఆశ్రయించడం వలన ఒకరికి మాత్రమే తీర్పు అనుకూలంగా వస్తుందని అన్నారు. కాని లోక్ అదాలత్ లో రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటున్నందున ఇరువైపులా విజేతలు అవుతారని వివరించారు. ఇతర కోర్టులలో గెలుపొందిన కేసుల్లో కక్షిదారులు ఇతర కోర్టు లను ఆశ్రయించవచ్చని,కాని లోక్ అదాలత్ లో ఇచ్చిన తీర్పే తుది తీర్పు అయినందున, ఇతర కోర్టులను ఆశ్రయించా ల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు. జిల్లాలో 23 వేల వరకు కేసులు పెండింగులో ఉన్నాయని, వీటిని సత్వరమే పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కని వేదిక అని అన్నారు. రాష్ట్ర ఉన్నత  న్యాయస్థానం పిలుపు మేరకు ప్రతీ రెండు మాసాలకు లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వ హించడం జరుగుతుందని, కక్షిదారు లకు ఇదొక మంచి అవకాశం అని వివరించారు. గత లోక్ అదాలత్ ద్వారా జిల్లావ్యా ప్తంగా 2 వేల కేసుల వరకు పరిష్కరించడం జరిగిందని, ప్రస్తుతం ఈ అదాలత్ ద్వారా సుమారు 14 వందల వరకు కక్షిదారులు దరఖాస్తు చేసుకున్నారని, ఈ కేసులన్ని పరిష్కరించనున్నట్లు తెలి పారు. లోక్ అదాలత్ ను ఆశ్రయించే కక్షిదారులు ఎటువంటి ఫీజులు చెల్లించనవసరం లేదని, దీనివలన ధనము,సమయం ఆదా అవుతుందని చెప్పారు. జిల్లా ప్రధాన కేంద్రంలో 4 బెంచు లతో పాటు జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంతవరకు పరిష్కారం కాని కేసుల విషయమై కక్షిదారులు పునరాలోచించి లోక్ అదాలత్ ను ఆశ్రయించి తమ కేసులను సత్వరమే పరిష్కరించు కోవా లని ఆయన కోరారు.  

అనంతరం ఆమదాలవలసకు చెందిన 4గురు కక్షిదారులకు 3 లక్షల 60 వేల రూపాయల అవార్డును  ప్రకటించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలి కోర్టు 3వ అదనపు జిల్లా న్యాయ మూర్తి పి.అన్నపూర్ణ, 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి టి. వెంకటేశ్వర్లు, శాస్వత లోక్ అదాలత్ ( పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ ) చైర్మన్ ఏ.గాయత్రి దేవి, సీనియర్ సివిల్ జడ్జి మరి యు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎం.అనురాధ, టౌన్ డి.ఎస్.పి ఎం.మహీంద్ర, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, ప్రత్యేక సంచార కోర్టు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జె.సౌమ్య జోసఫిన్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శిష్ఠు రమేష్, కార్యదర్శి కృష్ణప్రసాద్, న్యాయవాదులు పి.మల్లిబాబు, డా.జి.ఇందిరాప్రసాద్, శాశ్వత లోక్ అదాలత్ సభ్యులు పి.చం ద్రపతిరావు, ఇతర న్యాయ మూర్తులు,న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.