ఘనంగా ఆజాదీ కా అమృత మహోత్సవ్..


Ens Balu
3
Srikakulam
2021-09-11 10:18:26

శ్రీకాకుళం జిల్లాలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఫ్రీడం రన్ ఘనంగా జరిగింది. శనివారం ఉదయం అరసవిల్లి కూడలి నుండి ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంను పోలీస్ పోలీసు పిర్యాదుల అధారిటీ సభ్యులు పి. రజనీకాంతరావు ప్రారంభించారు. యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీకాంతరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల జరుపుకుంటున్న సందర్భంగా మహోత్సవం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ముఖ్యంగా యువత ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎందరో మహానుభావులు అసువులు బాసి స్వాతంత్రాన్ని సాధించి స్వేచ్ఛ జీవితాలను ప్రజలు గడుపుటకు కారకులయ్యారని పేర్కొన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగం కావాలని ఆయన చెప్పారు. అభివృద్ధి పై అవగాహన పెంచుకుని మహోన్నత దేశంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.  నెహ్రూ యువ కేంద్ర జిల్లా సమన్వయ అధికారి జి.మహేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో 744 జిల్లాల్లో అమృత మహోత్సవం ర్యాలీలు నిర్వహించుటకు అనుమతించటం జరిగిందని, అందులో శ్రీకాకుళం జిల్లా ఒకటని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.వి.ఎస్.వి జమదగ్ని, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. రామారావు, నెహ్రూ యువ కేంద్ర పరిపాలన అధికారి డి. శ్రీనివాస్, స్వచ్ఛంద సంస్థలు, యువత పాల్గొన్నారు.