అప్పన్న ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు..


Ens Balu
2
Simhachalam
2021-09-11 10:52:05

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ(సింహాద్రి అప్పన్న)స్వామి వారి దేవస్థానానికి ISO 9001:2015 (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ) సర్టిఫికెట్ లభించడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఈ మేరకు దేవస్థానానికి వచ్చిన గుర్తింపుని ఈఓ ఎంవీ సూర్యకళ మంత్రికి చూపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వామి వైభవం అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం ఆయన మహిమేనన్నారు. "ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చేలా కృషిచేసిన దేవస్థానం ఈఓ సూర్యకళ, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఈఓ మాట్లాడుతూ, ఆలయానికి చెందిన అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని హెచ్ వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్   సంస్థ ఈ గుర్తింపునిచ్చింది.  ఈ సర్టిఫికెట్ ను... రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్, దేవస్థానం ఈఓ సూర్యకళ అందుకున్నారు. ఈఓ మాట్లాడుతూ, మంత్రి చేతులమీదుగా ఈ అవార్డును స్వీకరించడం చాలా శుభ పరిమాణం అన్నారు. ఫుడ్ అండ్ సేఫ్టీ ఆడిటింగ్ ప్రస్తుతం దేవస్థానంలో జరుగుతోందని.. ఆ రంగంల్లోనూ ఐఎస్ఓ సర్టిఫికెట్ వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. గత ఆర్నెళ్ల నుంచి దేవస్థానంలో ఉద్యోగుల నాణ్యమైన సేవల గురించి ఆడిటర్ ద్వారా అంతర్జాతీయ సంస్థకు సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చామని, అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించే దేవస్థానంగా ఇపుడు గుర్తింపు పొందామని అన్నారు. కాగా  ప్రసాద్ స్కీం ద్వారా రూ.54 కోట్లు మంజూరయ్యాయని కరోనా సెకెండ్ వేవ్ వల్ల నిధులు రావడం కాస్త ఆలస్యమైందని మంత్రి వివరించారు. ఇప్పుడు ఆ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.