ప్రతీ మంగళవారం బ్లడ్ డొనేషన్ క్యాంపులు..


Ens Balu
2
Visakhapatnam
2021-09-11 11:59:31

బ్లడ్ డొనేషన్ క్యాంపులను వారంలో  ప్రతీ మంగళవారం, శుక్రవారం జిల్లాలో ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా కలెక్టరు డా.ఎ.మల్లిఖార్జున వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులలో వస్తున్న మార్పుల వలన డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధులు ఇంకా రెండు, మూడు నెలలు పెరిగే అవకాశం ఉన్నందున ఆయా వ్యాధులను నియంత్రించడానికి పటిష్టమైన చర్యలను చేపట్టాలన్నారు. ప్యాండమిక్ సీజన్ వలన జిల్లాలో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించలేకపోయినందున బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు తగ్గిపోయాయన్నారు. బ్లడ్ డొనేషన్ కు సంబంధించి అన్ని విధాల సహకారం అందిస్తామని కలెక్టరు తెలిపారు. కాబట్టి అత్యవసరంగా రక్తదాన కేంద్రాలను ఏర్పాటు చేయాలనన్నారు.  డెంగ్యూ వ్యాధి నియంత్రణకుసంబంధించి ప్లేట్లెట్స్ అవసరమని, సింగిల్ బ్లడ్ డోనర్స్ ను గుర్తించి ప్లేట్లెట్స్ సేకరణ చేయాలన్నారు. రక్త దాతల లిస్టును దగ్గర పెట్టుకుని రక్తం అవసరమైన పరిస్థితులలో వారికి ఫో్ను చేసి రప్పించే ఏర్పాటు చేయాలన్నారు.  రేర్ బ్లడ్ గ్రూపు, ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూపు వారిని ప్రోత్సహించి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి రక్తం అవసరం ఏర్పడినప్పుడు దాతలు ముందుకు వచ్చే విధంగా గ్రూపులో మెసేజ్ పెట్టాలన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏరోజు పెడుతున్నది ప్రసార మాధ్యమాల ద్వారా విసృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రవేటు ఆసుపత్రులు, స్వచ్చంధ సంస్థలు సేకరించిన రక్త నిధులలో 30 శాతం కె.జి.హెచ్ కు అందజేయాలన్నారు. సింగిల్ డోనార్స్ ఉంటే కె.జి.హెచ్ కు పంపించాలన్నారు.  పాడేరులో రెడ్ క్రాస్ సొసైటి ఒక బ్లడ్ బ్యాంకును ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డా.సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 5 ప్రభుత్వ ఆసుపత్రులు, 5 స్వచ్ఛంధ సంస్థలు, 10 ప్రైవేటు ఆసుపత్రులలో బ్లడ్ బ్యాంకులు ఉన్నాయని తెలిపారు. విక్టోరియా, అనకాపల్లి, పాడేరు ఏరియా ఆసుపత్రులలో కాంపోనెంట్ సెపరేషన్ యూనిట్లు లేవని, సంబంధిత టెక్నికల్ సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారని తెలిపారు. అందుకు కలెక్టరు స్పందిస్తూ తగు ఏర్పాట్లు చేస్తామన్నారు. బ్లడ్ స్టోరేజి యూనిట్లు నర్సీపట్నం, చింతపల్లి, చోడవరం, అరకు, కోటపాడు, నక్కపల్లి , అగనంపూడి లలో ఉన్నాయని తెలిపారు.  ఈ సమావేశంలో ఎ.ఎం.సి. ప్రిన్సిపాల్ డా.సుధాకర్, కె.జి.హెచ్ బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా.శ్యామల, డిఎల్ఒ డా.సత్యవాణి,ఎ.ఎస్.రాజా, ఎన్.టి.ఆర్, రోటరీ, లయన్స్, రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్  బ్యాంకుల ప్రతినిధులు, నగరంలో గల పది ప్రవేటు ఆసుపత్రుల బ్లడ్ బ్యాంకు ప్రతినిధులు హాజరయ్యారు.