విద్యా విధానంలో రాష్ట్రం కొత్త పుంతలు..


Ens Balu
4
Srikakulam
2021-09-11 12:15:10

రాష్ట్రంలోవిద్యా విధానంలో కొత్త పుంతలు తొక్కుతోందని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస మండలం తొగరం, కలివరం గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పీకర్ శని వారం పాల్గొన్నారు. తొగరం గ్రామంలో మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.18 లక్షల నిధులతో పనులు పూర్తి చేశారు. కలివరం గ్రామంలో మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.16.50 లక్షల నిధులతో పనులు పూర్తి చేసారు. సుమారు రూ. 22 లక్షల నిధులతో పనులు పూర్తి చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశం ఆయన మాట్లాడుతూ స్వగ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. నేటికి 15 సంవత్సరాలు నుంచి గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని, పల్లెల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకు వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసారు. విద్యా విధానం చూస్తే కొత్త పుంతలు తొక్కుతోందని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ధనికులు చదువుతున్నారని, పేదవాడి చదువు అందని ద్రాక్షలా ఉందని అందుకే పేదవాడికి కార్పొరేట్ విద్యను అందించాలని ముఖ్య మంత్రి ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు చదువు పేరు చెప్పి లక్షలు దోపిడీలు చేస్తున్నాయని ఆయన చెప్పారు. వాటిని నిలువరించడానికి ప్రభుత్వ విద్యాలయాలు కార్పోరేట్ కు దీటుగా తయారుచేసి ఇంగ్లీష్ విద్యా విధానం అమలు పరుస్తున్నారని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాల క్యాలెండర్ను విడుదల చేసి అమలుపరుస్తున్న ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అభివృద్ధి గురించి చర్చకు రావాలని స్పీకర్ తమ్మినేని అన్నారు.  ఈ కార్యక్రమంలో తొగరాం సర్పంచ్ వాణి సీతారం., తమ్మినేని చిరంజీవి నాగ్, స్థానిక నాయకులు తమ్మినేని శ్రీరామమూర్తి, బెండి గోవిందరావు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, పిఎసిఎస్ చైర్మన్, అధికారులు పాల్గొన్నారు.