భళా విశాఖ..కరోనా నియంత్రణలో ముందంజ..


Ens Balu
4
Visakhapatnam
2020-09-09 21:45:44

రాష్ట్రంలోని కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణ, కోవిడ్ నియంత్రణకు చేపట్టిన చర్యలలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ నేతృత్వంలో 19 పారామీటర్ లలో శతశాతం పాయింట్లు సాధించి మొదటి స్థానం సంపాదించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి..వినయ్ చంద్ జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ, అన్ని ఆసుపత్రుల డాక్టర్లు, అధికారులు, సిబ్బంది అందరూ నిర్విరామంగా నిబద్దత తో కృషి చేసి జిల్లాని ప్రథమ స్థానంలో నిలిపినందుకు అభినందించారు. ఐ సి యూ పడకలు, ఆక్సిజన్ పడకల నిర్వహణ, ఆసుపత్రులలో చేరిన వారిని త్వరగా కోలుకుని డిశ్చార్జి గావించడం,  అదేవిధంగా ఆసుపత్రిలో చేరిన వారిలో  మరణాలు ఎక్కువగా సంభవించకుండా, కూడా 100 శాతం పాయింట్లు సాధించారు. ప్రతీరోజూ  ఆస్పటల్ రిపోర్టులను పంపించడం,4 పర్యాయాలు మరుగుదొడ్లను, 2 పర్యాయాలు వార్డులను  శుభ్రపరచడం, నాణ్యమైన ఆహారాన్ని సకాలంలో రోగులకు అందించడం,డాక్టర్లు నర్సులు   తరచుగా సందర్శించడం, రోగులకు సేవలు అందించడం, ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆయా ఆసుపత్రుల సిబ్బంది మూడు షిప్టుల్లో  సమర్ధవంతంగా పని చేయడం, హెల్ప్ డెస్క్ నిర్వహణ,  ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు,   బీపీ, షుగరు మొదలైన పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించడం,నోడల్ అధికారుల పనితీరు, పడకలకు తగినట్లుగా డాక్టర్లు, నర్సులు నియమించడం,  కోవిడ్ పరీక్షలు నిర్వహించి బాధితులను గుర్తించడం మొదలైన 19 పారామీటర్స్ లో మొత్తం 2,500 పాయింట్లు కైవసం చేసుకుని విశాఖ ప్రథమ స్థానంలో నిలిచింది.