సత్యదేవునికి రూ.100116 విరాళం..


Ens Balu
5
Annavaram
2021-09-12 07:09:25

ఒడిసాలోని భువనేశ్వర్ కు చెందిన టి.సాయితేజ దంపతులు ఆదివారం శ్రీశ్రీశ్రీ వీర వేంకట సత్యన్నారాయణ స్వామివారి అన్నదానం ట్రస్టుకి రూ.100116 విరాళంగా సమర్పించారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావుకి అందజేశారు. అంతకు ముందు దాతలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారికి తమ కుటుంబం పేరున అన్నదానం చేయాలని కోరారు. దాతలకు అర్చక స్వాములు ఆశీర్వాదాలు అందించగా, ఈఓ వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.