ఇప్పటి వరకూ 30లక్షల మందికి వేక్సిన్..


Ens Balu
3
Chittoor
2021-09-12 10:52:27

చిత్తూరుజిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 30,78,292 కోవిడ్ వ్యాక్సినేషన్ డోస్ లు పూర్తి చేసినట్లు, ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మరో 2.03 లక్షల డోస్ లు పూర్తి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ పేర్కొన్నారు. గత  రెండు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని, ఇందులో భాగంగా ఈ నెల 11 వ తేది 93,248 రెండవ డోసులు మాత్రమే వేశామని, 12 వ తేది ఆదివారం మొదటి , రెండవ డోస్ లు వేసేందుకు 2.03 లక్షలు డోస్ లు జిల్లాకు అందాయని తెలిపారు. ఈ డోస్ లను 18 సంవత్సరాలు పై బడిన వారందరికి మొదటి, రెండవ డోస్ లు వేస్తున్నామని తెలిపారు. అన్ని మండలాలకు వ్యాక్సినేషన్ మందులు పంపిణీ చేయడమైనదని, ప్రతి మూడు మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్లు వారి పరిధిలో ఒక్కొక్కరు 15 మందిని గుర్తించి వ్యాక్సినేషన్ వేయించాలన్నారు. ఆదివారం ఉదయం నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నానికల్లా 1,25,921 మొదటి, రెండవ డోసు లు అన్ని పి.హెచ్.సి పరిధిలో వేశారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నానికి మిగిలి ఉన్న 97 వేల డోస్ లు రాత్రి లోపు పూర్తి చేసేందుకు మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, చిత్తూరు, తిరుపతి ఆర్.డి.ఓ లు రేణుక, కనకనరసా రెడ్డి లను, మండల స్పెషల్ ఆఫీసర్లు, తాహాసిల్ధార్లు, ఎం.పి.డి.ఓ లు, మునిసిపల్ కమిషనర్ లను ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ లేకుండా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఆదివారo నాడు జిల్లా వ్యాప్తంగా వేస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు మానిటర్ చేయడంతో మండల, జిల్లా అధికారులను వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు హెల్త్ కేర్ వర్కర్ లకు సంబందించి మొదటి డోసు 46,819 మందికి, రెండవ డోస్ 45,356 మందికి. ఫ్రంట్ లైన్ వర్కర్ లకు మొదటి డోస్ 1,07,125 మందికి, రెండవ డోస్ 97,536 మందికి వ్యాక్సినేషన్ ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చి అవగాహన కల్పించి వేశామని తెలిపారు. అలాగే 18-45 సంవత్సరాల వయసు వారికి మొదటి డోస్ 7,38,979 మందికి, రెండవ డోస్ 1,31,481 మందికి వెరసి 8,70,460 డోసులు, అలాగే 45 వయసు దాటిన వారికి మొదటి డోస్ గా 11,26,620 మందికి, రెండవ డోస్ 7,29,306 మందికి, వెరసి 18,55,926 ఇన్ని డోస్ లు  పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.