దేవాలయల నిధులు బ్రాహ్మణ కార్పోరేషన్ కి ఇస్తారా..?


Ens Balu
3
Visakhapatnam
2020-09-09 21:55:05

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి కొట్లాదిగా నిధులను ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఉత్తరాంధ్ర  బీజే పి ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు. బుధవారం విశాఖ నగరంలోని బీజేపి నగర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దేవాలయాలు కేవలం బ్రాహ్మణులకే సొంతంకాదని హిందూ సమాజంలో ప్రతీఒక్కరికీ హక్కు ఉంటుందన్నారు. అలాంటప్పుడు ఒక్క బ్రాహ్మణులకే ఈ నిధులు ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుపడుతోందన్నారు. తక్షణం ఆ నిధులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై సీబిఐ విచారణ చేయించాలన్నారు. అసలు తప్పు చేసిన వారిని వదిలిపెట్టి అధికారులపై చర్యలు తీసుకుంటే ఏం ఒరుగుతుందన్నారు. అంతర్వేది ఆలయంలో జరిగిన వ్యవహారంలో హిందువుల మనోబావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్న ఆయన ఎక్కడైతే దేవాలయాలు క్షేమంగా ఉంటాయో ఆ రాష్ట్రం శుభిక్షంగా వుంటుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ప్రభుత్వం కొత్త రథానికి నిధులు మంజూరు చేస్తే...అసలు దోషులు ఎలా బయటకి వస్తారని ప్రశ్నించారు. దోషులను పట్టుకున్న తరువాత స్వామివారి రధాన్ని తయారు చేయించాలని ప్రభుత్వానికి సూచించారు. అంతేకాకుండా రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక నిఘాతో కూడిన రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.