వేక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి..


Ens Balu
2
విశాఖ సిటీ
2021-09-12 13:24:21

విశాఖ  జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున వైద్యాధికారులను ఆదేశించారు. ఆధివారం ఉదయం రేసపువాని పాలెం, ఎం.వి.పి.లలో సచివాలయ కేంద్రాలను, జిల్లాకలెక్టర్ పరిశీలించారు. ఆరిలోవలో  ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంను  పరిశీలించి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.  ఆనందపురం, పద్మనాభం మండలాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆనందపురం మండలం గిడిజాల  ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, పధ్మనాభమండలం బి.తాళ్లవలస   ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్ పరిశీలించారు. డాక్టర్లను  వ్యాక్సినేషన్  ప్రక్రియ పై  వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రజలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మీరు వ్యాక్సినేషన్  వేయించుకునేందుకు సెంటర్ లకు ఎలా వచ్చారని అడిగారు . ఎ.ఎన్.ఎం.లు, ఆశావర్కర్లు, వాలంటీర్ల నుండి మెసేజ్ లు, పోన్ కాల్స్ రావడం జరిగిందని వారి సూచనల మేరకు  వచ్చామని ప్రజలు జిల్లా కలెక్టర్ కు తెలిపారు.  లిస్టులో ఉన్న వారందరికి మెసేజ్ పంపి వ్యాక్సినేషన్ పూర్తిగావించాలని  జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిశోర్, జి.వి.ఎం .సి వైద్యాధికారి .డా. శాస్త్రి,  తహసిల్దార్లు, మండల అభివృద్ది అధికారులు పాల్గొన్నారు.