తూర్పుగోదావరి జిల్లాలోని 29 సిడిపిఓ పోస్టులు ఖాళీలు ఉన్నట్టు ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జివిసత్యవాణి తెలియజేశారు. సోమవారం కాకినాడలో తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 28 ప్రాజెక్టుల పరిధిలో 49 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా, ప్రస్తుతం 20 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. ఖాళీగా వున్న 29 పోస్టుల భర్తీకై ప్రభుత్వానికి నివేదిక పంపామని ఆమె తెలియజేశారు. మిగిలిన వారితో కొన్ని కేంద్రాలు ఇన్చార్జిలుగా పనిచేయిస్తున్నామన్నారు. ప్రభుత్వం చిన్నారులు, గర్భిణీ స్త్రీల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన అన్ని పథకాలు పూర్తిస్థాయిలో అందిస్తున్నట్టు ఆమె వివరించారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాల అమలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.