శ్రీకాకుళం స్పందనకు 299 అర్జీలు..
Ens Balu
3
Srikakulam
2021-09-13 10:11:53
శ్రీకాకుళంజిల్లాలో సోమవారం నిర్వహించిన స్పందన వచ్చిన అర్జీలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, ఆసరా జెసి శ్రీరాములు నాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి అర్జీదారులు నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ, పింఛన్లు, వ్యవసాయం, విద్యా శాఖ, రేషన్ కార్డులు, తదితర సమస్యలు పై 299 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.