ఏన్సిడెంట్ జిల్లాలో త్వరగా పూర్తి చేయాలి..
Ens Balu
1
Srikakulam
2021-09-13 13:24:07
శ్రీకాకుళం జిల్లాలో ఏన్సిడెంట్ త్వరగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలో మంజూరైన సచివాలయాల పోస్టులు, మొదటి దశ, రెండవ దశల్లో విధులలో చేరిన అభ్యర్థులు, వారి ఏన్సిడెంట్ వివరాలు, శాఖా పరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వివరాలు, తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. మెమో తీసుకున్న, ఇఓఎల్ పెట్టిన వారిని ఎవరికి ప్రొహిబిషన్ డిక్లర్ చేయవద్దని ఆదేశించారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి అన్ని పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఇఓ లక్ష్మీపతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రనాయక్, వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, పశు సంవర్థక శాఖ జెడి కిషోర్, మత్య్స శాఖ జెడి శ్రీనివాసరావు, సర్వే శాఖ ఎడి కుంచె ప్రభాకరరావు, సెరికల్చర్ ఎడి అలజంగి విక్టర్ సాల్మన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.