17 నుంచి నూతన వార్డు సభ్యులకు శిక్షణ..
Ens Balu
1
Kakinada
2021-09-13 13:34:24
తూర్పుగోదావరి జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 5 వరకు మూడు దశలలో 1,103 పంచాయతీలలో నూతనంగా ఎన్నికైన సుమారుగా 11,773 మంది వార్డు సభ్యుల శిక్షణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఏపీఎస్ఐఆర్‌డీ) డైరెక్టర్ జె.మురళి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకుసోమవారం విజయవాడ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమానికి సంబంధించి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి ఎన్‌వీవీ సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్, ఇతర అధికారులు హాజరయ్యారు. కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీఎస్ఐఆర్‌డీ డైరెక్టర్ జె.మురళికి జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ వివరించారు. ఈ వీసీలో జిల్లా పరిషత్ పరిపాలనాధికారి సుబ్బారావు, కాకినాడ గ్రామీణ మండలం ఎంపీడీవో పి.నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.