విజయనగరం జిల్లాలో ఈనెల 11 నుంచి నేటి వరకు నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో 1.32 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి వెల్లడించారు. సోమవారం రోజు సాయంత్రం 5 గంటల వరకు 14 వేల మందికి వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేసుకోని వారికి, రెండో డోసు అవసరమైన వారికి కలసి మొత్తం 10.18 లక్షల డోసుల వ్యాక్సిన్ వేసేందుకు లక్ష్యంగా నిర్దేశించామని, సోమవారం సాయంత్రం వరకు ఈ లక్ష్యంలో 13శాతం సాధించామన్నారు. లక్ష్యం మేరకు శతశాతం వ్యాక్సినేషన్ చేసేందుకు తదుపరి దశల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు.