మల్టీకలర్ లో శ్రీవారి స‌ప్త‌గిరి మాసప‌త్రిక..


Ens Balu
5
Tirupati
2021-09-13 14:27:29

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో టిటిడి ఆర్ష ధ‌ర్మ ప్ర‌భోదం కోసం 1949వ సంవ‌త్స‌రంలో స‌ప్త‌గిరి ప‌త్రిక‌ను బులెటిన్‌గా ప్రారంభించింద‌ని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. 1970వ సంవ‌త్స‌రం నుండి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, ఆంగ్లం, హిందీ  భాష‌ల్లో, 2014వ సంవ‌త్స‌రం నుండి సంస్కృత భాష‌లో ముద్ర‌ణ ప్రారంభ‌మైంద‌న్నారు. 2016వ సంవ‌త్స‌రం నుంచి స‌ప్త‌గిరిని పూర్తిగా రంగుల్లో పాఠ‌కుల‌కు అందిస్తున్నామ‌న్నారు.ఇప్ప‌టికి 50 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని ఆధ్యాత్మిక ప‌త్రిక‌ల్లో అగ్ర‌గామిగా ఉంద‌న్నారు. స‌ప్త‌గిరి మాస ప‌త్రిక ఆరు భాష్ల‌ల్లో పునఃప్రారంభ‌మైంద‌ని, ఇందులో అనేక కొత్త శీర్షిక‌ల‌తో, ధారావాహిక‌ల‌తో పాఠ‌కుల‌కు నిరంత‌రాయంగా అందుతుంద‌ని చెప్పారు. అంత‌కుముందు అగ‌ర‌బ‌త్తుల త‌యారీ ప్లాంట్ వ‌ద్ద శ్రీ‌వారి చిత్ర‌ప‌టానికి ఛైర్మ‌న్‌, ఎమ్మెల్యే,  ఈవో, అద‌న‌పు ఈవోలు  పూజ‌లు నిర్వ‌హించి ప్లాంట్‌ను ప్రారంభించారు. త‌రువాత ప్లాంట్‌లో అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసే యంత్రాల ప‌నితీరును ప‌రిశీలించారు.  ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి,  సూళ్ళూరుపేట యం.ఎల్.ఏ  సంజీవ‌య్య‌, ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి డా.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, టీటీడీ సిఇ నాగేశ్వ‌ర‌రావు, గో సంర‌క్ష‌ణ శాల డైరెక్డ‌ర్ డా.హ‌ర‌నాథ‌ రెడ్డి, ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ప్రతినిధులు  శ్రీ‌నివాస్‌, ఆశోక్‌,  హ‌ర్ష, సప్తగిరి మాస పత్రిక ముఖ్య సంపాదకులు  రాధా రమణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.