ప్రభుత్వం ఛలో అంతర్వేదిని అడ్డుకోవడం సిగ్గుచేటు..
Ens Balu
1
Guntur
2020-09-10 12:40:05
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుసదాడనులను నిరసిస్తూ.. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన నివాసంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2014తర్వాత హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింన్నారు. 2014నుంచి 2019వరకు టీడీపీ హయాంలో దేవాలయాలు కులగొట్టారన్న కన్నా ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండతో మతమార్పిడి, డేవాలయాలపై దాడులు ఎక్కువయ్యాయని తీవ్రంగా ఆరోపించారు. గుంటూరులో, పిట్టపురం, ఉద్రజావారం, ప్రకాశం బ్యారేజీ వద్దకుడా, నెల్లూరు జిల్లాలో భుఅక్రమనలు, ఇప్పుడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రధం దగ్ధం చేయడం ఇవన్నీ నిదర్శనాలు కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మతిస్థిమిటంలేని వారుచేసారని చేతులు దులుపుకో వడం ఎంతవరకూ సమంజసమని, ఆలయంలో రక్షణ చర్యలు తీసుకోకపోవడమే ఈ సంఘటకు ప్రధాన కారణమని దుయ్యబట్టారు. దాడులకు గురైన వాటిని వెంటనే బాగుచేయలని డిమాండ్ చేశారు. అంతర్వేది ఘటనలో ఇంతవరకు ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోక పోవడం కూడా ఒకనాటకమని ఆరోపించారు. రాష్ట్రంలో పెద్ద దేవాలయాలను, చిన్న దేవాలయాలను వెంటనే హిందువులకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులు చేసిన వాటిని ఖండించడానికి వెళ్ళేవారిని అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రతిఒక్క హిందువు ఈఘటనలను ఖండించాలని కన్నా పిలుపునిచ్చారు.