అనంతపురంలో వాకర్స్ సమస్యల పరిష్కారంకు కృషిచేస్తానని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. మంగళవారం మేయర్ , డిప్యూటీ మేయర్ కొగటం విజయ్ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అనంత చంద్రారెడ్డి లతో కలసి పిటీసీ లో పర్యటించారు. వాకర్స్ తోపాటు క్రీడాకారులతో వారు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పిటీసీ గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని,త్రాగునీటి సౌకర్యం కల్పించాలని వారు కోరారు. అదే విధంగా వాకింగ్ కోసం వచ్చే వారి కోసం పిటీసీ కి ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలంలో పార్క్ ఏర్పాటు చేయాలని,వాకర్స్ సౌకర్యం కోసం లైట్లు ఏర్పాటు చేయాలని మేయర్ ను కోరారు. దీనిపై మేయర్ వసీం ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానికంగా శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అనంత చంద్రారెడ్డి మేయర్,డిప్యూటీ మేయర్ లు సమావేశమై వారి శిక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చంద్రమోహన్ రెడ్డి,కమల్ భూషణ్, అనిల్ కుమార్ రెడ్డి , పార్టీ నాయకులు ఖాజా , స్పోర్ట్స్ కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.