నైపుణ్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం..
Ens Balu
3
శ్రీకాకుళం
2021-09-15 14:40:04
నైపుణ్యంలో ఉచిత శిక్షణ పొందడానికి పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్.సి. కార్పొరేషన్ ఇడి కె. రామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. DSCSCS లిమిటెడ్, శ్రీకాకుళం -NSFDC- స్కిల్ ట్రైనింగ్/PM -DAKSH -షార్ట్, మీడియం మరియు లాంగ్ టర్మ్ స్కిలింగ్ ప్రోగ్రామ్లు-ట్రేడ్లు, ఇండస్ట్రీ లింక్డ్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కార్యక్రమంలో నిరుద్యోగ SC అభ్యర్థులు తమ పేర్లు https://emdaksh.dosje.gov.in వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. వెబ్ డెవలప్పర్ (అంతర్జాల వృద్ధికారుడు) గా 3 నెలల 5 రోజులుగా శిక్షణ ఉంటుందని, డిగ్రీ/ వెబ్ డిజైన్ లో డిప్లమా, మీడియా డిజైన్ లేదా ఏదైనా ఇతర సంబంధిత డిప్లొమా/విద్యార్హత ఉండాలని, క్యాడ్లో మాస్టర్ సర్టిఫికెట్ కోర్సు 6 నెలల కాలం ఉంటుందని, డిప్లమా/ మెకానికల్ లో డిగ్రీ /ప్రొడ్ ఇంజనీరింగ్ లేదా సమానమైనది ఉండాలని, AI-బిజినెస్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు కు 4 నెలల శిక్షణ కాలం ఉంటుందని, విద్యార్హత సైన్స్ కంప్యూటర్లో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, సీన్స్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇంజనీరింగ్/సమాచారం టెక్నాలజీ ఉండాలని ఆ ప్రకటనలో వివరించారు. క్లౌడ్ ఆర్కిటెక్ట్ కోర్సు కు 4 నెలలు శిక్షణా కాలం ఉంటుందని, దీనికి విద్యార్హత ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ సైన్స్ కంప్యూటర్ సోన్స్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండాలని, అడ్వాన్స్డ్ ఎక్సెల్లో సర్టిఫికెట్ కోర్సుకు 1.5 నెలల కాలం ఉంటుందని, ఇంటర్ పాస్ మరియు అంతకంటే ఎక్కువ అర్హత కలిగి ఉండాలని తెలిపారు. భద్రతా విశ్లేషకుడు కోర్సు 3.5 నెలల శిక్షణ కాలం ఉంటుందని, ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా ఏదైనా గ్రాడ్యుయేట్ కోర్సు చేసి ఉండాలని, దేశీయ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు కు 3.5 నెలల శిక్షణ కాలం ఉంటుందని, 10వ తరగతి పాస్ మరియు దాని కంటే ఎక్కువ ఉండాలని పేర్కొన్నారు. CNC మిల్లింగ్ లో సర్టిఫికెట్ కోర్సు కు 6 నెలలు పాటు శిక్షణ కాలం ఉంటుందని, 10 వ తరగతి ఉత్తీర్ణత మరియు అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉండాలని తెలిపారు. CNC టెక్నాలజీలో మాస్టర్ సర్టిఫికెట్ కోర్సు 6 నెలలు పాటు శిక్షణ ఉంటుందని, మెకానికల్/ప్రొడ్ ఇంజనీరింగ్లో డిప్లొమా/డిగ్రీ లేదా తత్సమానమైనది ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల వయోపరిమితి 18-45 సంవత్సరాల మధ్య ఉండాలని, అభ్యర్థుల వివరాలను అప్లోడ్ చేయడానికి సెప్టెంబరు 30వ తేదీతో ముగుస్తుందని ఆ ప్రకటనలో వివరించారు. ఆసక్తి గల షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు తమ పేర్లను పోర్టల్ లో నమోదు చేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.