ఎస్వీ యూపీ స్కూలులో ప్లే క్లాస్ తరగతులు..


Ens Balu
1
Tirumala
2021-09-17 12:17:29

తిరుమల స్థానికుల విజ్ఞప్తి మేరకు టిటిడి ఈఓ ఆదేశాల ప్రకారం ఈ విద్యాసంవత్సరం నుంచి ఎస్వీ ప్రాథమిక పాఠశాలలో ప్లే క్లాస్ తరగతులు ప్రారంభించినట్టు జెఈఓ  సదాభార్గవి తెలిపారు. ఈ మేరకు జెఈఓ శుక్రవారం పాఠశాలను సందర్శించి ప్లే క్లాస్ తరగతుల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ స్థానికులు వారి పిల్లలను పూర్వ ప్రాథమిక విద్య కోసం తిరుపతికి పంపించలేక ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ పరిస్థితుల్లో తిరుమల ఎస్వీ పాఠశాలలోనే ఈ తరగతులను ప్రారంభించడానికి చర్యలు చేపట్టామన్నారు. అనంతరం భోజనం నాణ్యతను పరిశీలించారు. త్వరలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి కావాల్సిన వసతులపై చర్చించాలని హెచ్ఎంకు సూచించారు. అనంతరం ఆమె విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఇక్కడ అందుతున్న వసతులు, విద్య గురించి చర్చించగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి డిఈఓ  గోవిందరాజన్, పాఠశాల హెచ్ఎం  కృష్ణమూర్తి పాల్గొన్నారు.