కోవిడ్ 3వ దశను దైర్యంగా ఎదుర్కోవాలి..
Ens Balu
3
Srikakulam
2021-09-18 10:08:31
కోవిడ్ - 19 మూడవ దశను ఎదుర్కొనుటకు అంతా సిద్ధంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుండి కోవిడ్ - 19 వ్యాక్సినేషన్ పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యదర్శి రాజీవ్ గౌబ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ నిల్వలు చూసుకోవాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది, మెడిషన్, తదితర వాటిని సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కార్యక్రమం పక్కాగా జరగాలని, రెండవ డోసు ఖచ్చితంగా వేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. డెంగ్యూ కేసు బలగలో నమోదు అయ్యిందని, కమీషనర్లు శానిటేషన్ జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. జిల్లా నుండి వీడియో కాన్పరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులుతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రనాయక్, మున్సిపల్ కమిషనర్లు శ్రీకాకుళం ఓబులేసు, రాజాం ఆమదాలవలస, పలాస - కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్లు రమేష్, సుధాకర్, రాజగోపాల్, తదితరులు పాల్గొన్నారు.