వైఎస్సార్ కంటివెలుగు నిరుపేదలకు వరం..
Ens Balu
3
Anantapur
2021-09-18 10:17:54
వైఎస్ఆర్ కంటివెలుగు కార్యక్రమం పేదలకు వరమని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. అనంతపురం 21 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ మహాత్మాగాంధీ స్కూల్ లో వైయస్సార్ ఇంటింటా కంటి వెలుగు ఉచిత కంటి పరీక్ష 3వ దశ కార్యక్రమం ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాల్గొని చికిత్స లు అందిస్తున్న తీరును పరిశీలించారు. అన్ని అవయవాలు కళ్ళు ఎంతో ముఖ్యమైనవని కంటిచూపు విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. వృద్దులే కాకుండా ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.వై ఎస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ, ఆపరేషన్ లు ఉచితంగా చేస్తారని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చంద్రలేఖ, కమల్ భూషణ్,బాలాంజినేయులు,స్థానిక వైకాపా నాయకులు కుల్లాయి స్వామి తదితరులు పాల్గొన్నారు.