రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తిచేయండి..
Ens Balu
3
Anantapur
2021-09-18 12:12:29
అనంతపురం నగరంలో రోడ్ల మరమ్మతులు వేగవంతంగా పూర్తి చేస్తామని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని సప్తగిరి సర్కిల్ లో జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను శనివారం నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి తో కలసి మేయర్ పరిశీలించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో దెబ్బతిన్న రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం సప్తగిరి సర్కిల్ ,హాస్పిటల్ రోడ్డు, యస్ యస్ ప్యారడైస్ ముందు, ఆర్ట్స్ కాలేజీ వద్ద ,ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర, వేమన టెలిఫోన్ భవన్ వద్ద తదితర ప్రాంతాల్లో ప్యాచ్ వర్క్ పనులు జరుగుతున్నట్లు అధికారులు మేయర్ కు వివరించారు. నాణ్యత తో పనులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాలాంజినేయులు, డిఈ కృష్ణారావు, ఏఈ శంకర్, సెక్రెటరీ కే తేజస్విని తదితరులు పాల్గొన్నారు.