తూ.గో.జిలో కౌంటింగ్ సర్వం సిద్దం..కలెక్టర్


Ens Balu
2
Kakinada
2021-09-18 14:08:37

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. శనివారం కాకినాడ అశోక్ నగర్ లో మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కాకినాడ గ్రామీణం, కరప, పిఠాపురం, గొల్లప్రోలు, యూ కొత్తపల్లి మండలాల స్ట్రాంగ్ రూమ్ లను, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ సి.హరికిరణ్, కాకినాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలసి పరిశీలించారు.
   ఈ సందర్భంగా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లేక్కింపు  ప్రక్రియకు సంబంధించి 7డివిజన్ లలో 12 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి అన్ని అంశాల పట్ల శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రాథమిక ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం తుది ఓట్ల లెక్కింపు ప్రారంభించి మూడు రౌండ్లలో లెక్కింపు పూర్తిచేయడం జరుగుతుందని దీనికి అనుగుణంగనే టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 19న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ప్రాథమిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని కలెక్టర్ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల చెందిన కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఎటువైపు నుంచి ఏజెంట్లు, సిబ్బంది రావాలి, బారికేడ్లు ఏర్పాట్లు, తదితర అంశాలపై కలెక్టర్ హరికిరణ్ అధికారులకు పలు సూచనల చేశారు. గొల్లప్రోలు మండలనికి సంబంధించి  శిక్షణకు హాజరయిన కౌంటింగ్ సిబ్బందితో కలెక్టర్ మాట్లాడి, ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన పద్ధతులు పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
     అనంతరం కలెక్టర్ హరికిరణ్ రంగరాయ వైద్య కళాశాలలో ఏర్పాటుచేసిన పెదపూడి, సామర్లకోట, తాళ్లరేవు మండలాలకు  సంబంధించిన స్ట్రాంగ్ రూంలను, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
     ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్ని కృష్ణ, డీడీ హార్టికల్చర్ రామ్మోహన్ రావు, సీపీవో పీ.బాలాజీ, ఎమ్ హెచ్వో డా.పృథ్వీచరణ్, కాకినాడ గ్రామీణం  ఎంపీడీవో పీ.నారాయణమూర్తి,
తహసిల్థార్ వీ మురళీకృష్ణ, కరప మండలం ఎంపీడీవో కె.స్వప్న, తహసిల్దార్ విశ్వేశ్వరరావు, పెదపూడి మండలం ఎంపీడీవో పి.విజయభాస్కర్, తహసిల్దార్ టీ.సుభాష్, సామర్లకోట మండల తహసీల్దార్ జితేంద్ర, తాళ్లరేవు మండలం ఎంపీడీవో పి.విజయ్ థామస్, తహసిల్దార్ జీ.చినబాబు, పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.