తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా టంగుటూరి మారుతిప్రసాద్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీ మారుతిప్రసాద్ కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అదనపు ఈఓ అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, డెప్యూటీ ఈవో (జనరల్) సుధారాణి, పేష్కార్ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.