కాకినాడ మేయర్ పై అవిశ్వాస తీర్మాణం..
Ens Balu
3
Kakinada
2021-09-20 02:19:31
తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో వైఎస్సార్సీపీలో విభేధాలు రచ్చకెక్కాయి. దీనితో కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్‌పై అక్టోబర్ 5న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. నిన్న కలెక్టర్‌ను కలిసిన 33 మంది కార్పొరేటర్లు.. నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మేయర్ పావనికి జిల్లా కలెక్టర్ హరికిరణ్ నోటీసులు పంపించారు. నోటీసు తీసుకునేందుకు ఇంట్లో నుంచి మేయర్ పావని బయటకు రాకపోవడంతో మేయర్ ఇంటి గోడకు అధికారులు నోటీసును అతికించారు. కాకినాడ మేయర్ మార్పు అనివార్యం కానుంది..