లీజు బంకుల్లోనే అధిక మోసాలు..లీగల్ మెట్రాలజీ ఐజీ


Ens Balu
4
Tenali
2020-09-10 20:26:00

రాష్ట్రంలో ఎక్కువగా లీజుకు తీసుకున్న పెట్రోల్ బంకులలో మోసాలు జరుగుతున్నాయని లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ ఇస్పెక్టర్ జనరల్ పోలీస్ ( ఐజి) ఎం కాంతా రావు అన్నారు.  గురువారం మంగళగిరి తెనాలి జంక్షన్  బైపాస్  రోడ్డు భారత్ ప్రెటోల్ బంక్ లో ఆకస్మిక తనీఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కాంతారావు మాట్లాడుతూ,  రాష్ట్రంలో 300 ప్రెట్రోల్ బంకులు లీజ్ పద్దతిలో నిర్వహిస్తున్నట్లుగా సమాచారం ఉందన్నారు.  వాటిపై నిఘా పెట్టామన్న ఆయన  పెట్రోల్ బంకులు లీజుకు ఇవ్వడం నేరమన్నారు. అనధికారికంగా  బంకుల లీజుల నిర్వహణ వ్యవహరం ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు.  ఎక్కడైన లీజు కు తీసుకున్న బంకులలో అయిల్ కొట్టించుకోవాలంటే అలోచన చేయాల్సిందే..  ఎక్కువగా చిప్ మోసాలు జరిగే అవకాశాలు మెండుగా వున్నాయన్నారు. యజమానులు నడిపే ప్రెట్రోల్ బంకులలో చిప్ మోసాలు తక్కువగా వున్నాయి. మోసాలకు అవకాశం వున్న మిషన్లకు అనుమతులు ఇవ్వవద్దని ఢిల్లీ లీగల్ మ్రెట్రాలజీ వారికి లేఖ వ్రాసినట్లు తెలిపారు.  ఆయిల్ కొట్టించుకొనే సమయంలో ప్రజలు  ప్రజలందరూ ఆయిల్ కొట్టించుకొనే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.  అంతేకాకుండా బంకులలో అనుమానం వస్తే  5 లీటర్ల  క్యాన్ ద్వారా పరీక్షించే అధికారం ప్రతీ వినియోగదారుడికీ ఉందన్నారు. ఆయిల్ కొట్టించుకొనే సమయంలో "0" చేసి కొడుతున్నారో లేదో చూసుకోవాలన్నారు..  ఎక్కడైనా ఫ్యూయల్ యంత్రాల్లో తేడాలు ఉంటే  ప్రతి ప్రెటోల్ బంకు వద్ద బోర్డులపై వున్న తనీఖీ అధికారుల  ఫోన్ నెంబర్లకు  ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఈ సందర్భంగా  లీగల్ మెట్రాలజీ గుంటూరు జాయింట్ కంట్రోలర్ ( జెసి) రామ్ కుమార్ .  ప్రెట్రోల్ బంకులలో జరిగే చిఫ్ మోసాలపై డెమో అవగాహన కల్పించారు.  తనీఖీలలో  లీగల్ మెట్రాలజీ ఫ్లైయింగ్ స్వాడ్ విజయవాడ డిప్యూటీ కంట్రోలర్  కాకి ఐజక్, డిప్యూటీ కంట్రోలర్ మనోహార్ , తెనాలి అసిస్టెంట్ కంట్రోలర్ పి లిల్లీ తదితరులు పాల్గోన్నారు.