26, 27 రాష్ట్ర బి.సి. సంక్షేమ కమిటీ పర్యటన..
Ens Balu
2
Tirupati
2021-09-20 06:24:36
ఈ నెల 26, 27 తేదీలలో రాష్ట్ర బి.సి. సంక్షేమ కమిటీ చిత్తూరు జిల్లాలో పర్యటించ నున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఒక ప్రకటన లో తెలిపారు. రాష్ట్ర బి.సి. సంక్షేమ కమిటీ చైర్మన్ జంగా కృష్ణముర్తి , కమిటీ సభ్యులు (శాసన సభ్యులు) బొత్సా అప్పలనరసయ్య, అన్నమ రెడ్డి అదిప్ రాజు , బుర్రా మధుసూదన్ యాదవ్, ఎన్. వెంకటే గౌడ , రమేష్ బాబు సింహాద్రి, కె. పెద్దిరెడ్డి, వెంకటరామిరెడ్డి, బొల్లా బ్రహ్మ నాయుడు, పి. జి. వి. ఆర్. నాయుడు, దువ్వారపు రామారావు ( ఎం ఎల్ సి) లు ఈ నెల 26 న వెలగపూడి నుండి బయలుదేరి తిరుమల చేరుకొని బస చేస్తారు. తేది 27 న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని, తిరుపతి పద్మావతి అతిధి గృహం చేరుకుంటారు. ఉదయం 11.00 గంటల నుండి బి. సి. సంఘాలు, వ్యక్తుల నుండి వినతులు స్వీకరించి, 11.30 గంటలకు టి. టి. డి. లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు , మధ్యాహ్నం 2.30 గంటలకు జిల్లా ఉన్నతాదికారులతో అమలు అవుతున్న బి సి సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించి వై. ఎస్. ఆర్. కడప బయలు దేరనున్నారని కలెక్టర్ ఆ ప్రకటన లో తెలిపారు.