టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియోగా జి.వాణీమోహన్ ప్రమాణస్వీకారం..


Ens Balu
3
Tirumala
2021-09-20 10:03:46

రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ,  క‌మిష‌న‌ర్ జి.వాణి మోహ‌న్ టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఎక్స్ అఫిషియో స‌భ్యురాలిగా,  జీవ‌న్‌రెడ్డి,  మూరంశెట్టి రాములు,  కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, బూదాటి ల‌క్ష్మీనారాయ‌ణ స‌భ్యులుగా సోమ‌వారం ఉదయం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  రమేష్ బాబు, డెప్యూటీ ఈవో (జనరల్)  సుధారాణి, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో  లోక‌నాథం, పేష్కార్  శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.