విజయనరగరం జిల్లా డీఈఓగా ఎన్.సత్యసుధ..
Ens Balu
3
Vizianagaram
2021-09-20 10:52:23
విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారిగా ఎన్.సత్యసుధ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇంతకుముందు గుంటూరు ఆర్‌జెడి కార్యాలయంలో సహాయ సంచాలకులుగా పనిచేస్తూ, పదోన్నతితో డిఇఓగా జిల్లాకు వచ్చారు. కొద్దిరోజుల క్రితం వరకూ ఇక్కడ డిఇఓగా పనిచేసిన జి.నాగమణి, జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది బదిలీ కావడంతో, ఈ పోస్టు ఖాళీ అయ్యింది. ప్రస్తుతం ఇన్‌ఛార్జి డిఇఓగా పనిచేస్తున్న ఏడి లక్ష్మణరావు నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు. సత్యసుధ జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించేముందు, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారిని కలిసి అనుమతి తీసుకున్నారు.