రేపు జిల్లాలో గురజాడ జయంతి వేడుకలు..
Ens Balu
1
Vizianagaram
2021-09-20 12:09:54
నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు 159వ జయంతోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఒక తెలిపారు. విజయనగరం పట్టణంలోని గురజాడ స్వగృహంలో ఉదయం 9 గంటలకు, మహాకవి చిత్రపటానికి పూలమాలాంకరణతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అక్కడినుంచి తరలివెళ్లి, మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల సమీపంలోని గురజాడ కాంస్య విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరుగుతుందన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ, జూమ్ మీటింగ్ ద్వారా, పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులచే గురజాడ దేశభక్తి గేయాలాపన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, సాహితీవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.