విశాఖ జిల్లా స్పందనకు 255 అర్జీలు..


Ens Balu
2
Visakhapatnam
2021-09-20 12:19:11

‘స్పందన’లో  వచ్చిన అర్జీలను అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని   జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించిన, స్పందన’కార్యక్రమములో ప్రజల నుండి  వినతులను స్వీకరించారు. ఈ రోజు ‘స్పందన’లో 255 అర్జీలను స్వీకరించారు. అంతకు ముందు కలెక్టరు అధికారుల సమావేశంలో  మాట్లాడుతూ నిన్న జరిగిన ఎం.పి.టి.సి., జెడ్.పి.టి.సి వోట్లు లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది సమర్ధవంతంగా నిర్వహించారని అభినందించారు. తదుపరి కలెక్టరు కోవిడ్ ప్రోటోకాల్ పై వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో   జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్  (హౌసింగ్) కల్పనా కుమారి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) అదితీసింగ్, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి గోవిందరావు, డి.ఆర్.ఓ శ్రీనివాసమూర్తి జిల్లా అధికారులు పాల్గొన్నారు.