డయల్ యువర్ కమిషనర్ కు 17 కాల్స్..


Ens Balu
2
జివిఎంసీ
2021-09-20 12:26:30

డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 17 ఫోన్ కాల్స్, స్పందనలో 50 ఫిర్యాదులు వచ్చాయని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజన  తెలిపారు. సోమవారం పాత సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 ద్వారా డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం కార్యక్రమం నిర్వహించారు.  రెండవ జోనుకు 01, మూడవ జోనుకు 03, నాలుగవ జోనుకు 01, అయిదవ జోనుకు 01, ఆరవ జోనుకు 06, ఎనిమిదవ జోనుకు 05, మొత్తము 17 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ వి. సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణ రాజు, డి.సి.(ఆర్) నల్లనయ్య, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, జె.డి.(అమృత్) విజయ భారతి, యు.సి.డి.(పి.డి.) వై. శ్రీనివాస రావు, ఎఫ్.ఎ. & ఎ.ఒ. మల్లికాంబ, డి.పి.ఓ. చంద్రిక, పర్యవేక్షక ఇంజినీర్లు వినయ్ కుమార్, రాజా రావు, శివ ప్రసాద్ రాజు, శ్యాంసన్ రాజు, వేణు గోపాల్, కె.వి.ఎన్.రవి, గణేష్ బాబు, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆదినారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.