క్రాప్స్ విలేజ్ పనులను వేగవంతం చేయాలి..


Ens Balu
7
Tirupati
2021-09-20 12:31:15

తిరుపతి సమీపంలో ఏర్పాటు చేస్తున్న క్రాప్స్ విలేజ్ పనులను వేగ వంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో టూ రిజమ్ అండ్ రీ సర్చ్ రీజనల్ డైరెక్టర్ ప్రభాకరన్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఎ.డి. సత్యమూర్తి, ఆర్కి టెక్చర్ రమేష్, ఆర్ అండ్ బి ఇంజినీర్లు సుధాకర్ రెడ్డి, సుజాత, డి.ఆర్.డి.ఎ పి.డి తులసి మరియు కాంట్రాక్ట్ ప్రతినిధులతో కలిసి క్రాఫ్ట్ విలేజ్ పనులను సమీక్షించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి శ్రీకాళహస్తి ల మధ్య టూరిజం ను అభివృద్ది చేసేందుకు పానగల్లు గ్రామం వద్ద 9 ఎకరాల్లో టూరిజం శాఖ చేస్తున్న అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని ప్రస్తుతం కోవిడ్ నిబందనల మేరకు పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కాంట్రాక్టర్ లను ఆదేశించారు. టూరిజం అండ్ రీ సర్చ్ రీజనల్ డైరెక్టర్ ప్రభాకరన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వచ్చే ఆగష్టు నాటికి ప్రదాన మంత్రి చేతుల మీదుగా ప్రారంబించాలని ఆదేశాలు రావడం జరిగిందని, ఈ ప్రాంతంలో వివిధ సాంప్రధాయ హస్త కళలను  అభివృద్ది చేసే దిశగా ఈ నిర్మాణం జరుగుతోందని, దీని ద్వారా స్థానిక కళాకారులకు గుర్తింపు లబిస్తుందని, నైపుణ్యత పెంచుకునేందుకు వస్తువులకు సంబందించి డిజైన్ చేసేందుకు మరియు మార్కెటింగ్ సౌకర్యం పొందేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ఈ సంధర్భంగా డి.ఆర్.డి.ఎ పి.డి తులసి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ మొత్తం 9.55 కోట్లతో ప్రారంభమైందని, ఇప్పటి వరకు ప్రభుత్వం 4.775 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టును ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేసి ఆ తరువాత ఇంటీరియల్ డిసైన్ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.