ఓటరు సవరణ విజయవంతంగా పూర్తిచేయాలి..


Ens Balu
2
Chittoor
2021-09-20 12:32:33

ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం 2022 ను సజావుగా నిర్వహించాలని ఈ నెల 30 లోపల అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్  అన్నారు. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం 2022 ను జిల్లాలో సజావుగా నిర్వహించాలని ఈ కార్యక్రమం నవంబర్ 1 నుండి ప్రారంభం కానున్న దని అయితే అక్టోబర్ 31 లోపల ఫ్రీ రివ్యూ పూర్తి చేయాలని, ఇందుకు సంబందించి డబుల్ ఎంట్రీస్, మరణించిన వారు వివరాల కోసం బూట్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్ళి సర్వే నిర్వహించి ఫారం లో వారి వివరాలను పూర్తిగా నింపి గరుడా యాప్ లో నింపాలని అన్నారు.  ఎస్.ఎస్.ఆర్ (స్పెషల్ సమ్మరీ రివిజన్) 2022  ప్రిపరేషన్ యాక్టివిటీస్, రేషనలైజేషన్ యాక్టివిటీ, గరుడ మొబైల్ యాప్, ఓటర్స్ హెల్ప్లైన్ మొబైల్ యాప్, ఈఆర్ఓఎన్ఈటి ఫార్మ్స్ పురోగతి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జిల్లాలోని ఆర్.ఓ లు, ఈ.ఆర్.ఓ లు, ఇతర సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పగడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఓటర్ల సవరణ కార్యక్రమం పగడ్బందీగా జరగాలని, ఏదైనా గ్రామంలో పోలింగ్ నిర్వహించే భవనాలు, పాతవి అయిన, ఇరుకు అయిన ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కారణాలను చూపి పోలింగ్ కేంద్రాలను మార్చుకోవచ్చునని అన్నారు. ఈ నెల 31 లోపల ఈ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పూర్తి చేసి, రాజకీయ పార్టీల వారికి సమాచారం అందించిన తరువాత జిల్లా స్థాయిలో  రాజకీయ పార్టీలతో సమావేశం 3వ తేదీ న నిర్వహిస్తామన్నారు. బి.ఎల్ ఓ లు గా వి.ఆర్.ఎ లు, ఆశాలు, అంగన్ వాడి, విధ్యుత్ శాఖ, మహిళా పోలీసు లాంటి వారిని నియమించ కూడదన్నారు. బి.ఎల్.ఓ లు ఎ.ఈ ఆర్ ఓ లతో కలిసి పోలింగ్ కేంద్రాల మార్పులు చేర్పులు ఉంటే అక్కడ ఉన్న ఓటర్లతో చర్చించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతిపాదనలను పంపాలనిఅన్నారు.కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వ్యక్తుల వివరాలను ఇంటింటికీ బూత్ స్థాయి అధికారులు వెళ్లి పరిశీలించాలన్నారు. బి.ఎల్.ఓలు విధిగా సందర్శించి గరుడ యాప్ లో పొందుపరచాలని చెప్పారు. నవంబరు 1వ తేదీన సమీకృత ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు డి.ఆర్.ఓ ఎం.ఎస్.మురళి, కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.