కోవిడ్ డ్రైవ్ లో 1,00,522 మందికి వేక్సిన్లు పంపిణీ..


Ens Balu
3
Chittoor
2021-09-20 14:13:20

చిత్తూరు జిల్లాలో సోమవారం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 1,20,000 డోసులు వేయుటకు లక్ష్యానికి గాను సాయంత్రం 6.30 గంటలకు 1,00,522 డోసులు వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకనూ కొనసాగుతోందని ఈ ప్రత్యేక డ్రైవ్ లో జిల్లాకు ఒక లక్ష డోసుల కోవిడ్ షీల్డ్, 20 వేల డోసుల కో వ్యాక్సిన్ మందులు సరఫరా అయిందని ఇందులో కో వ్యాక్సిన్ రెండవ డోస్ వారికి మాత్రమే వేయవలసిందిగా అలాగే కోవీ షీల్డ్ రెండవ డోస్ తో పాటు మొదటి డోస్ 18 - 44 వయసు గల వారికి కూడా వేయించాలని ఆదేశించామన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ను జాయింట్ కలెక్టర్లు హౌసింగ్ మరియు ఆసరా పర్యవేక్షిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 35,24,106 డోసుల వ్యాక్సినేషన్ వేయించగా ఇందులో 23,14,552 మొదటి డోస్ లు కాగా 12,09,554 రెండవ డోసులు వ్యాక్సినేషన్ చేశామన్నారు.  ఇందులకు సహకరించిన ప్రజా ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, ఆర్.డి.ఓ లు, స్పెషల్ ఆఫీసర్లు, మండల, మునిసిపల్ టాస్క్ ఫోర్స్ టీమ్ లు, మెడికల్ అధికారులు, తదితర సిబ్బందికి,  జిల్లా కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.