జిల్లాలో గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి..


Ens Balu
3
Srikakulam
2021-09-20 14:25:17

శ్రీకాకుళం జిల్లాలో గృహ నిర్మాణాలు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలపై మండల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణం పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని అన్నారు. గృహ నిర్మాణ సంస్థ అధికారులు, ప్రత్యేక అధికారులు గృహ నిర్మాణాలపై శ్రద్ధ వహించాలని, లబ్ధిదారులకు ప్రేరణ కల్పించి త్వరితగతిన గృహాలు పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలన్నారు. పనులు పూర్తి అయిన మేరకు బిల్లులను అప్లోడ్ చేయాలని ఆయన పేర్కొన్నారు. పునాదుల స్థాయి నుండి ఇతర స్థాయిలకు నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనలో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, కే.శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్ , గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్. గణపతి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్. కూర్మా రావు, ఆర్డీవో ఐ.కిషోర్  తదితరులు పాల్గొన్నారు.