చిత్తూరు జిల్లా స్పందనకు 236 అర్జీలు..
Ens Balu
3
Chittoor
2021-09-20 14:28:05
సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అని గ్రామ సచివాలయం లో కూడా స్పందన అర్జీలను ఇవ్వవచ్చనని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. సోమవారం నాడు స్పందన కార్యక్రమం వద్దు అని ప్రకటించినా వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు రావడంతో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని అప్పటికప్పుడే స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 236 మంది లబ్ధిదారుల నుంచి వారి వారి సమస్యలను స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూకు సంబంధించిన 131,వివిధ డిపార్ట్ మెంట్లకు సంభందించి51, డి ఆర్ డి ఏ కు 35,హౌసింగ్ కు 10, సివిల్ సప్ప్లైస్ కి 02,పోలీసు శాఖకు 02 సమస్యలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తోపాటు జాయింట్ కలెక్టర్లు రాజా బాబు, వెంకటేశ్వర, రాజశేఖర్, డిఆర్ఓ మురళి, సివిల్ సప్లైస్ అధికారి శివరాం ప్రసాద్, జెడి అగ్రికల్చర్ దొరసాని తదితరులు పాల్గొన్నారు.