కలెక్టర్ సూర్యకుమారి వినూత్న ఆలోచన.. జూమ్ లో గురజాడ గేయాలాపన..
Ens Balu
2
Vizianagaram
2021-09-21 07:21:26
గురజాడ 159 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి వినూత్న ఆలోచన చేసారు. కోవిడ్ ను దృష్టిలోపెట్టుకొని ప్రత్యక్షంగా విద్యార్ధులు పాల్గొనలేని పరిస్థితి ఉన్నందున వారందరిని జూమ్ ద్వారా పాల్గొని గురజాడ విరచిత గేయాన్ని దేశమును ప్రేమించుమన్నా –మంచి యన్నది పెంచుమన్నా ఒకేసారి సామూహికంగా ఆలపించే ఏర్పాటుచేసారు. ముందుగా మహారాజా సంగీత కళాశాల వారు పాడి వినిపించగా తదుపరి అందరూ అదే బాణీ లోపాడారు. ఈకార్యక్రమం లో 34 మండల ప్రధాన కేంద్రాల్లో నున్న పాఠశాలల , 5 మున్సిపల్ , 25 కే జి బివి పాఠశాలల, 11 డిగ్రీ కళాశాలల విద్యార్ధులతో పాటు కోరుకొండ సైనిక స్కూల్ విద్యార్ధులు, గిరిజన విశ్వ విద్యాలయం, సెంచూరియన్ విద్యార్ధులు, 6 ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్ధులు , జిల్లా విద్య శాఖ, మున్సిపల్ కమీషనర్, సాంస్కృతిక కలశాల ల నుండి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి మాట్లాడుతూ గురజాడ గీతాన్ని ఆలపించిన తర్వాత విద్యార్ధులకు ఆ గేయం అర్ధాన్ని, భావాన్ని అర్ధం అయ్యేలా ఉపాధ్యాయులు వివరించాలని అన్నారు. వినూత్నంగా అందరిని కలుపుతూ చేపట్టిన ఈ కార్యక్రమం లో భాగస్వామ్యులైన వారందరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కలక్టరేట్ నుండి కలెక్టర్ తో పాటు జే. సి లు డా. కిషోర్ కుమార్, జే. వెంకట రావు, పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ, ఐ అండ్ పి ఆర్ ఎ.డి డి. రమేష్, రాజీవ్ విద్య మిషన్ ప్రాజెక్ట్ అధికారి డి. కీర్తి తదితరులు పాల్గొన్నారు.