పాలిటెక్నిక్ కు భవనాల పరిశీలించిన స్పీకర్..
Ens Balu
3
Srikakulam
2021-09-21 08:11:13
వ్యవసాయ పాలిటెక్నిక్ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించుట చర్యలు చేపడుతున్నట్లు శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నికల్ కాలేజ్, డిగ్రీ కళాశాలలకు స్థల పరిశీలన, వ్యవసాయ పాలిటెక్నికల్ కాలేజ్ కు తాత్కాలిక భవనాల కొరకు శాసన సభాపతి తమ్మినేని సీతారాం మంగళ వారం పరిశీలించారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుండి వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ తరగతులు ప్రారంభించుటకు చర్యలు చేపడుతున్నారు. తాత్కాలికంగా తరగతులు ప్రారంభించుటకు నిరుపయోగంగా ఉన్న భవనాలను పరిశీలిస్తున్నట్లు స్పీకర్ సీతారాం చెప్పారు. అనంతరం అక్కడ తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వ్యవసాయ కళాశాల మంజూరు కావడం ముదావాహమని ఆయన చెప్పారు. ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో కళాశాలను మంజూరు చేశారని ఆయన అన్నారు. జిల్లాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న భవిష్యత్తు వ్యవసాయ రంగానిదే నని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ సాంకేతిక విద్యను అభ్యసించి నైపుణ్యాలు సాధించాలని ఆయన సూచించారు. వ్యవసాయ రంగం లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చు కోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తమ్మినేని శ్రీరామమూర్తి, అధికారులు, అనదికారులు పాల్గొన్నారు.